భారతదేశ సంస్కృతి భారతదేశంలో వేర్వేరుగా ఉన్న అన్ని మతాలు, వర్ణాలు, కులాల , వర్గాల సమష్టి కలయిక. భారతదేశంలోని భిన్న సంస్కృతుల ఏకత్వం. భారతదేశము లోని వివిధ భాషలు, మతాలు, సంగీతం, నృత్యం, ఆహారం, నిర్మాణ కళ , ఆచారాలు, వ్యవహారాలు దేశంలో ఒక్కో ప్రాంతానికి ఎంతో భిన్నంగా ఉంటాయి. భారతీయ సంస్కృతి అనేది అనేక సంస్కృతుల సమ్మేళనంగా పిలువబడుతున్నది , ఇది భారత ఉపఖండం మొత్తంలో విస్తరించి ఉంది , అనేక వేల సంవత్సరాల చరిత్రను ప్రభావితం చేసింది. భారతీయ సంస్కృతిలో వైవిధ్యమైన భాగంగా ఉన్న భారతీయ మతాలు, భారతీయ తత్వశాస్త్రం , భారతీయ వంటకాలు వంటి అనేక అంశాలు ప్రపంచవ్యాప్తంగా బలీయమైన ప్రభావం కలిగి ఉన్నాయి.


 

    భారతీయ మతాలు

సమ్మేళనం భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తాయి.

    

    మందిరము పేరుతో ప్రసిద్ధి. సిక్కుల పవిత్ర క్షేత్రం.

భారతదేశం 28 రాష్ట్రాలు, 9 కేంద్రపాలిత ప్రాంతాలు వాటి వివిధ సంస్కృతులు, నాగరికతలతో వైవిధ్యమైన సంస్కృతి కలిగినది, ప్రపంచంలోని అత్యధిక జనాభా కలిగిన దేశాలలో ఒకటి.భారతీయ సంస్కృతిని తరచూ పలు విభిన్న సంస్కృతుల సమ్మేళనంగా పిలుస్తారు, ఇది భారత ఉపఖండంలో మొత్తం వ్యాపించింది. దాదాపుగా 5000 సంవత్సరాలకు పూర్వం నుండే భారత సంస్కృతి ఉన్నట్టు చరిత్ర కారులు చెబుతారు ఇది అనేక వేల సంవత్సరాల పురాతనమైన చరిత్రచే ప్రభావితం చేయబడింది , మలచబడి ఉంది. భారతదేశ చరిత్ర మొత్తంలో, భారతీయ సంస్కృతి ధార్మిక మతాలచే బాగా ప్రభావితం చేయబడి ఉంటుంది. భారతీయులు, భారతీయ తత్వశాస్త్రం, సాహిత్యం, వాస్తుశిల్పం, కళ , సంగీతం రూపొందించడంలో చాలా ఘనత పొందారు. గ్రేటర్ ఇండియా భారతీయ సంస్కృతి చారిత్రక పరిధి అనేది భారతీయ ఉపఖండం నకు మించింది. ఇది ముఖ్యంగా హిందూ మతము, బౌద్ధమతం, వాస్తు, శిల్పం, భవన నిర్మాణ శాస్త్రం పరిపాలన , వ్రాత వ్యవస్థలు కామన్ ఎరా ప్రారంభ శతాబ్దాల్లో ప్రయాణీకులు , సముద్ర వ్యాపారులు సిల్క్ రోడ్ ద్వారా ఆసియాలోని ఇతర ప్రాంతాలకు వ్యాప్తి చెందింది. గ్రేటర్ ఇండియా పశ్చిమాన, హిందూ కుష్ , పామిర్ పర్వతాలలో గ్రేటర్ పర్షియాతోను కలసి విస్తరించి ఉంది. అనేక శతాబ్దాలుగా, బౌద్ధులు, హిందువులు, ముస్లింలు, జైనులు, సిక్కులు , భారతదేశంలోని వివిధ గిరిజన ప్రజల మధ్య వివిధ సంస్కృతుల గణనీయమైన కలయికను కలిగి ఉంది.


     భారతదేశం హిందూ మతం, బౌద్ధమతం, జైన మతం, సిక్కు మతం , ఇతర మతాలు జన్మస్థలం. వీటిని సమష్టిగా భారతీయ మతాలు అని పిలుస్తారు. నేడు, హిందూమతం , బౌద్ధమతం వరుసగా మూడో , నాల్గవ అతిపెద్ద మతాలుగా ఉన్నాయి, వీటిలో 2 బిలియన్ల మంది మతాన్ని ఆరాధించి ఆచరించే అనుచరులు ఉన్నారు , దాదాపుగా 2.5 లేదా 2.6 బిలియన్ల మంది ఆదరించి అనుసరించే అనుచరులు ఉన్నారు.భారతీయ మతాలను ఆరాధించి ఆచరించే అనుచరులు అయినటువంటి హిందువులు, సిక్కులు, జైనులు , బౌద్ధులు భారతదేశంలో 80-82% జనాభా ఉన్నారు.   ప్రపంచంలోని అత్యంత ఆరాధనతో కూడిన మత సంఘాలు , సంస్కృతులతో కలిగి ఉండి మతపరంగా , జాతిపరంగా విభిన్న దేశాలలో భారతదేశం కూడా ఒకటి. ఈ మతాలు అనేకమంది ప్రజల జీవితంలో కేంద్ర స్థానంలో ఉండి , నిర్ణయాత్మక, నిశ్చయాత్మక పాత్రను వారి మీద పోషిస్తున్నాయి. భారతదేశం ఒక లౌకిక హిందూ-మెజారిటీ దేశం అయినప్పటికీ, ఈ దేశంలో అతి పెద్ద ముస్లిం జనాభాను ఇది కలిగి ఉంది. భారతదేశం లోని జమ్మూ కాశ్మీర్, లఢక్ , పంజాబ్, మేఘాలయ, మణిపూర్, నాగాలాండ్, మిజోరం , లక్షద్వీప్ లను మినహాయించితే హిందువులు 24రాష్ట్రాలు , 6 కేంద్రపాలిత ప్రాంతాల్లో అత్యధిక జనాభాను కలిగి ఉన్నారు. అదేవిధముగా, ఉత్తరప్రదేశ్, బీహార్, మహారాష్ట్ర, కేరళ, తెలంగాణ, పశ్చిమబెంగాల్ , అస్సాం రాష్ట్రాలలో ముస్లింలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ముఖ్యంగా జమ్ము కాశ్మీర్ , లక్షద్వీప్ లలో మాత్రం ఎక్కువమంది ముస్లిం జనాభా ఉన్నారు. అలాగే సిక్కులు , క్రైస్తవులు భారతదేశంలోని ఇతర ముఖ్యమైన మైనారిటీ ప్రజలు ఉన్నారు.


    2011 సం.జనాభా లెక్కల ప్రకారం, భారతదేశంలో 79.8% మంది హిందూ మతాన్ని ఆచరించి, పాటిస్తున్నారు. భారతదేశంలో హిందూ మతము అనుసరించి ఆచరించే ప్రజలు తరువాత ఇస్లాం (14.2%), క్రైస్తవ మతం (2.3%), సిక్కు మతం (1.7%), బౌద్ధ మతం (0.7%) , జైనమతం (0.4%) అనే ఇతర ప్రధాన మతాలు ఆచరించే వారు ఉన్నరు.  హిందూ మతం, బౌద్ధమతం, ఇస్లాం మతం , క్రైస్తవ మతం వంటి ప్రధాన మతాలచే భారతదేశంలో వివిధ ప్రాంతాలలో ప్రభావితమైనప్పటికీ, సార్నాయిజం వంటి అనేక గిరిజన మతాలు కూడా భారతదేశంలో కనిపిస్తాయి.  జైనమతం, జొరాస్ట్రియనిజం, జుడాయిజం, , బహాయి విశ్వాసం కూడా ప్రభావవంతమైనవి, కానీ వాటి సంఖ్య చాలా తక్కువగా ఉంది. భారతదేశంలో కూడా నాస్తికత్వం , అజ్ఞేయవాదం లక్షణాలు అక్కడాక్కడా కనిపించే ప్రభావాన్ని కలిగి ఉంటాయి. ప్యూ రీసెర్చ్ సెంటర్ నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, 2050 నాటికి భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద హిందువులు , ముస్లింలను కలిగి ఉన్న దేశంగా ఉంటుంది. భారతదేశంలో సుమారు 311 మిలియన్ల ముస్లింలు జనాభాలో 19-20% మంది ఉన్నారు. ఇంకా సుమారు 1.3 బిలియన్ల హిందువులు జనాభాలో 76% మంది భారతదేశంలో నివసిస్తున్నారు.


       - Rohit Mahanan

               Oddisa